Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని పద్మశాలి సంఘంలో సోమవారం మార్కండేయ స్వామి జయంతిని నిర్వహించారు. నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జెటి వెంకట నర్సయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అర్చనలు చేశారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, అర్చకుడు కులకర్ణి గోపి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Advertisement