అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కె.స్వప్న చిరు ప్రయత్నంతో అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. తనకెందుకులే.. తన విధి నిర్వహణ కాదని సరిపెట్టుకోకుండా సామాజిక బాధ్యత చాటారు. నగర పౌరులతో ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలి వర్షాలకు నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే ప్రతిరోజు అక్కడే విధులు నిర్వహించే కానిస్టేబుల్ స్వప్న ఈ సమస్యను గుర్తించి.. తనే స్వచ్ఛందంగా పారపట్టి మట్టితో గుంతను పూడ్చివేశారు. దీంతో పలువురు వాహనదారులు ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.