అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: కాలం చెల్లిన బైకును ఓ యువకుడు ఇష్టారీతిన మార్పు చేసి నడుపుతుండడంపై ‘అక్షరటుడే’లో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. ‘ఇదెక్కడి బండి నాయనా’ అనే శీర్షికన ఆదివారం వార్త ప్రచురితం కాగా.. సీపీ కల్మేశ్వర్ సూచన మేరకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం సదరు బండిని ప్రగతి నగర్ లోని ఓ గ్యారేజ్ వద్ద గుర్తించి సీజ్ చేశారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.