అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరానికి చెందిన బొబ్బిలి మురళి తండ్రి సాయిలు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సోమవారం పరామర్శించారు. అలాగే 17వ డివిజన్ కార్పొరేటర్ సవితను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. ఆమె భర్త రాజు ఇటీవల మరణించారు. ఆయన చిత్రపటం వద్ద బిగాల నివాళులర్పించారు. మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, సిర్ప రాజు, దారం సాయిలు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుదాం రవిచందర్, పరమేష్, పంచరెడ్డి సురేష్, సంపత్, శ్రీను, గాండ్ల లింగం ఉన్నారు.