నిజాంసాగర్ కెనాల్ కు గండి

0

అక్షరటుడే ఆర్మూర్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీ సమీపంలో ఉన్న నిజాంసాగర్ కెనాల్ కు గండి పడింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కట్ట తెగిపోయి ఒక్కసారిగా కాలనీలోకి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో బయట నిద్రిస్తున్న స్థానికులు నీటి ప్రవాహంతో ఉలిక్కిపడ్డారు. పలువురు తమ ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగి ఇళ్లలోకి నీరు చేరిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వేసవి వేళ సాగునీటి కోసం రైతులు తిప్పలు పడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో పెద్దమొత్తంలో నీరు వృథాగా పోయింది.