అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారిగా జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కుటుంబ సర్వే ఎంత వరకు వచ్చిందనే వివరాలు సేకరించారు. సమావేశంలో ఎంపీడీవో గంగాధర్, మండల పంచాయతీ అధికారి అనిత పాల్గొన్నారు.