అక్షరటుడే, జుక్కల్: ఎకనామికల్ సర్వేను తప్పులు లేకుండా పూర్తిచేయాలని మండల ప్రత్యేకాధికారి శ్రీపతి సూచించారు. నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ లో సర్వేను మంగళవారం పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట మండలాభివృద్ధి అధికారి గంగాధర్, ఎంపీవో అనిత పంచాయతీ కార్యదర్శులు రవి తదితరులున్నారు.