అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి రెండో విడత నీటి విడుదలను గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద 1,15,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా జూన్‌లో మొదటి విడతగా 1.20 టీఎంసీల నీటిని వదిలారు. ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించినట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగుల(17.80టీఎంసీలు)కు గాను 1391.80 అడుగుల(4.80 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.