అక్షరటుడే, నిజాంసాగర్‌: డయల్‌ 100ను మిస్‌యూజ్‌ చేసిన ఒకరిని తహశీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు నిజాంసాగర్‌ ఎస్సై శివకుమార్‌ తెలిపారు. మహమ్మద్‌ నగర్‌ మండలం గాలిపూర్‌కు చెందిన టెక్కలి నాగరాజు సోమవారం రాత్రి మద్యం తాగి 100కు డయల్‌ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మంగళవారం తహశీల్దార్‌ సవాయిసింగ్‌ ఎదుట బైండోవర్‌ చేశామన్నారు.