అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : దివ్యాంగ విద్యార్థుల ఉన్నతి కోసమే వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ఎన్నారై, రామ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు నోముల రాంచంద్రారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. దివ్యాంగుల ఉన్నతి కోసం వృత్తి శిక్షణకేంద్రం ఏర్పాటుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ప్రిన్సిపాల్‌ జ్యోతి, కార్యదర్శి సిద్దయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, కోఆర్డినేటర్‌ కిరణ్మయి, ట్రస్ట్‌ కార్యదర్శి వాసుగౌడ్, ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ జీవన్ పాల్గొన్నారు.