అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు భాజపాయేతర రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. యూజీసీ జారీ చేసిన నిబంధనల ముసాయిదాపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ముసాయిదాను పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.