అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం కాగా.. తొలి ఎగ్జామ్ కు సగం మంది అభ్యర్థులు కూడా హాజరు కాలేదు. పరీక్షకు జిల్లాలో 19,855 మంది దరఖాస్తు చేసుకోగా.. 10,785 మంది గైర్హాజరయ్యారు. కేవలం 9,070 మంది మాత్రమే పరీక్ష రాశారు. మధ్యాహ్నం 3 గంటలకు మరో సెషన్‌ పరీక్ష ఉండనుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.