అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్ పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్నెన్స్, ఆర్డ్నెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21వ తేదీలోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు: 3,883 ఖాళీలు (ఐటీఐకు సంబంధించి 2498; నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి)
ట్రేడ్ లు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితరాలు
అర్హత: ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం. నాన్-ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు.
స్టైఫండ్ : నెలకు నాన్-ఐటీఐలకు రూ.6 వేలు; ఐటీఐలకు రూ.7 వేలు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: నాన్- ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు రుసుము:
జనరల్ : రూ.200
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్ : రూ.100