అక్షరటుడే, కోటగిరి: మండలంలోని ఎత్తోండ గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై కోనేరు శశాంక్ గురువారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి బీజేపీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, వర్ని మండలాధ్యక్షుడు శంకర్, నస్రుల్లాబాద్ మండలాధ్యక్షుడు సున్నం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.