అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నుడా ఛైర్మన్ కేశవేణును ఘనంగా సన్మానించారు. వినాయక్ నగర్‌లోని బస్వాగార్డెన్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జిల్లా అధ్యక్షుడు విక్కీ యాదవ్, నగరాధ్యక్షుడు ప్రీతం పాల్గొన్నారు.