అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నుడా ఛైర్మన్ కేశ వేణు హితవు పలికారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన సాగిస్తుంటే బస్మాసుర హస్తం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వన్ టైం వండర్‌గా గెలిచిన ఎమ్మెల్యే ధన్‌పాల్ అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే 80 శాతం హామీలను అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండి నిధులు తీసుకురావాల్సింది పోయి ఎమ్మెల్యే నిత్యం విమర్శలు చేయడం సరికాదున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేసిన రోడ్డు పనులను తానే చేశానని ధన్‌పాల్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.