అక్షరటుడే, వెబ్ డెస్క్: నగర శివారులోని బోధన్ రోడ్డులో గల ఎన్ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో వెలిసిన అక్రమ వెంచర్ పై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. వారం రోజుల్లోపు రోడ్లు, హద్దురాళ్లు తొలగించాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శుక్రవారం నోటీసు జారీ చేశారు. 167, 173, 174/ఆ, 175/ఆ సర్వే నంబర్లకు చెందిన యజమానులు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ పనులు మొదలు పెట్టారు. ఈ విషయమై రెండ్రోజుల కిందట “అక్షరటుడే”లో కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధిత సర్వే నంబర్లలో పరిశీలించి నోటీసులు అందజేశారు. అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని నగర ప్రజలకు సూచించారు.