అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామం వద్ద వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణకి అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. వర్షాకాలంలో బ్రిడ్జిపై వరద ప్రవహిస్తుంది. దీంతో అటువైపు ఉన్న వెల్లుట్ల, వెల్లుట్లపేట, రత్నాపూర్, తిమ్మారెడ్డి, తిమ్మారెడ్డి తండా, అజాంబాద్, వెంకటాపూర్ గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కరించాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశించారు. దీంతో ఆర్ అండ్ బీ డీఈ నారాయణ, ఏఈ ఐశ్వర్య బ్రిడ్జ్ ఎత్తు పెంచడానికి కొలతలు తీసుకున్నారు. కుడుముల సత్యం, శ్రీనివాస్ రెడ్డి, సామెల్ తదితరులు ఉన్నారు.