అక్షరటుడే, ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి రైల్వేగేట్ను రెండు రోజుల పాటు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు చేపడుతుండడంతో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు గేట్ మూసి వేస్తామని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు.