అక్షరటుడే, ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంకాపూర్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కోసం పట్టుబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు ఎమ్మెల్యేకు కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్, ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఉపాధ్యక్షుడు దోండి ప్రకాష్, కార్యదర్శి మిరియాల్కర్ కిరణ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగొట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షుడు పీర్ సింగ్ నాయక్, జుగ్గె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.