అక్షరటుడే, బోధన్: మండలంలోని పెంటాకుర్దు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు శనివారం షీ టీం సభ్యులు విజయ్, గౌతమి అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో పలు సూచనలు చేశారు. మహిళలపై జరిగే నేరాలు, టీ సేఫ్ యాప్, డయల్ 100, సైబర్ నేరాల గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రత్నాకర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.