అక్షరటుడే, బాన్సువాడ: భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం బాన్సువాడ సబ్ డివిజన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత వ్యత్యాసాలు లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.