అక్షరటుడే, బాన్సువాడ: ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తితో మెలగాలని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని భారత హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగ్గ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ అన్నారు. అనంతరంఉపాధ్యాయులకు, విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.