అక్షరటుడే, కోటగిరి: ఏపీ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నివాసి గాజుల అనిల్‌కుమార్ శబరిమలకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ గెలిస్తే కాలినడకన శబరిమలకు వస్తానని మొక్కుకున్నానని, ఆయన గెలిచినందున 1,200 కి.మీ పాదయాత్ర చేశానని పేర్కొన్నారు. ఆయన వెంట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.