అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పాత్ర ఎంతో కీలకమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌ రావు అన్నారు. శుక్రవారం జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్‌ చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంకిషన్‌ రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో నుడా మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఎనుగందుల మురళి, నర్సింగ్‌ రావు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.