అక్షరటుడే, వెబ్డెస్క్: హైదరాబాద్లో మందుబాబులకు తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ ఫ్రీ క్యాబ్ సర్వీస్ ఆఫర్ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. 9177624678 నెంబర్కి కాల్ చేస్తే క్యాబ్ సర్వీస్ అందిస్తామని, దీని కోసం నగరం పరిధిలో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.