అక్షరటుడే, బాన్సువాడ: వసంత పంచమి సందర్భంగా బీర్కూరు మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుంచి గురుస్వామి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బాసరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 95 మంది భక్తులు బాసరకు బయలుదేరారు. 10వ సారి పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. లింగం గురుస్వామి, గుడికొండ బాలకృష్ణ, డాక్టర్ బాలకృష్ణ, శశికాంత్, కొర్రి శివకుమార్ యాదవ్, చీదరి రాజు, మల్దొడ్డి విట్టల్, ఆకాష్ కుమార్, కందకుర్తి సంతోష్ గుప్తా, రాములు, సిద్దు, నారం శ్రీనివాస్, సాయికృష్ణ తదితరులు పాదయాత్రగా వెళ్లారు.