అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారులు శనివారం ‘పొలం బాట’ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ రమేష్ విద్యుత్ ప్రమాదాల నివారణ, కరెంటు సరఫరా, వోల్టేజ్ నియంత్రణ, వ్యవసాయ మోటార్ల భద్రతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రవణ్ కుమార్, లైన్మెన్లు గంగాధర్, నరేష్, రమేష్, సత్యనారాయణ, ముక్కెర విజయ్, మల్లయ్య , గుండేడి పురుషోత్తం, వినోద్, సత్యం, శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.