అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండలం టాక్లిలో మెటల్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.