అక్షర టుడే, వెబ్‌డెస్క్: ఆదివాసి నాయక్‌పోడ్ కులస్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆదివాసి నాయక్ పోడ్ సంఘం కామారెడ్డి జిల్లా గౌరవాధ్యక్షుడు గాండ్ల రాంచంద్ర అన్నారు. మంగళవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెంటయ్య, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సాయిలు, సాయిబాబా, శంకర్, దుర్గయ్య, సాయిలు, రాజు, విఠల్, తదితరులున్నారు.