అక్షరటుడే, ఇందూరు: జిల్లా కేంద్రంలో ఈ నెల 17న వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎగ్జిబిషన్(ఓడీఓఈ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీఎస్‌ఐసీ పీఆర్ మేనేజర్ వీణ పేర్కొన్నారు. నాబార్డ్, టీఎస్‌ఐసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎగ్జిబిషన్ వాల్ పోస్టర్లను శనివారం హైదరాబాద్‌లో అధికారులు ఆవిష్కరించారు. ఓడీఓఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌లో రైతు ఉత్పిత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు, కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
17న ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎగ్జిబిషన్’
Advertisement
Advertisement