అక్షరటుడే, బోధన్: నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యమైంది. గురువారం స్కూల్ కు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఒక బాలికను నిజామాబాద్‌లోని బస్టాండ్‌లో శుక్రవారం గుర్తించారు. కాగా.. మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.