అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: హైవేపై అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం కారును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన హఫీజ్ సయ్యద్ అయుబ్, మౌలానా మొయినుద్దీన్, హఫీజ్ షాహెద్ రాజా, అబ్దుల్ రెహ్మన్లు ముషిరాబాద్లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వస్తుండగా బీబీపూర్ తండా వద్ద జాతీయ రహదారిపై వీరి కారును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో కారు బోల్తా పడి ఇద్దరికి తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అబ్దుల్ రెహ్మన్ మృతిచెందాడు. హఫీజ్ సయ్యద్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు.