అక్షరటుడే ఇందల్వాయి: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఇందల్వాయి మండల కేంద్రంలోని పీహెచ్సీ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతదేహంపై నుంచి వాహనాలు వెళ్లడంతో గుర్తు పట్టలేని విధంగా మారింది. ఎస్సై మనోజ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.