అక్షరటుడే, ఆర్మూర్​: మద్యం తాగివ వాహనాలు నడిపిన కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. వేల్పూర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్​ మండలంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా రామన్నపేట్​ గ్రామానికి చెందిన తెడ్డు రమేశ్​ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చగా రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.