అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నడుచుకుంటూ వెళ్తుండగా బైకు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం ఉదయం హనుమాన్‌ నగర్‌కు చెందిన వేముల రాసోటి అనే వ్యక్తి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి బైకు వచ్చి ఢీకొట్టింది. దీంతో తలకు ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని జీజీహెచ్‌కు తరలించారు.