అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా యాదగిరిని కొనసాగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిజిస్ట్రార్‌ యాదగిరి పదవీకాలం 2025 డిసెంబర్‌ 15తో ముగుస్తుండగా ఆయనను తిరిగి కొనసాగిస్తూ తెయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ యాదగిరిరావు ఆదేశాలు జారీ చేశారు.