అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ నగర ట్రాఫిక్‌ సీఐగా పబ్బ ప్రసాద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన వీరయ్యను పీసీఆర్‌కు పంపించిన విషయం తెలిసిందే. కాగా.. ఆదిలాబాద్‌ డీసీఆర్‌బీలో పనిచేసిన ప్రసాద్‌ ట్రాఫిక్‌ సీఐగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.