అక్షరటుడే, కోటగిరి : మండలంలోని రుద్రూర్‌కు చెందిన పద్మ ధనుష్, జవహర్‌నగర్ కాలనీకి చెందిన చిన్న కిష్టయ్యలు నెలరోజుల కిందట సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో గుర్తించారు. శనివారం ఎస్సై సాయన్న వారికి తిరిగి సెల్‌ఫోన్లు అప్పగించారు. ఎవరైనా తమ ఫోన్లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా సీఈఐఆర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై సూచించారు.