అక్షరటుడే, నిజామాబాద్సిటీ: పరస్పర సహకారంతోనే అందరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు విశాల్, స్నేహ సొసైటీ సభ్యులు వీరేశం, రమణారెడ్డి, జీవన్ రావు, బాబా గౌడ్, విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.