అక్షరటుడే, కామారెడ్డి: మహిళా కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా పాక జ్ఞానేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. రెండోసారి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.