అక్షరటుడే,వెబ్‌డెస్క్‌ : సొంత గడ్డపై జరుగుతున్న టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌లో ఎట్టకేలకు పాకిస్తాన్‌ విజయం సాధించింది. ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ మధ్య శుక్రవారం జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 152 పరుగులు తేడాతో పాకిస్తాన్‌ చిత్తు చేసింది. సుమారు 1,350 రోజులుగా విజయం కోసం ఎదురుచూస్తున్న పాకిస్తాన్‌ ప్రజల మొహాల్లో ఎట్టకేలకు ఆనందం కనిపించింది. బజ్‌బాల్‌ గేమ్‌తో భయపెట్టాలని చూసిన ఇంగ్లండ్‌ను పాకిస్తాన్‌ స్పిన్నర్లు కట్టడి చేశారు.