అక్షరటుడే, వెబ్‌డెస్క్: పాకిస్ధాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నాలుగేళ్ల తర్వాత యూరప్‌నకు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు హిందుస్థాన్ టైం కథనంలో పేర్కొంది. 2020 జూన్‌లో.. పాకిస్ధాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన భద్రతా లోపాలు, ప్రమాదాలు, పైలట్ లైసెన్స్ కుంభకోణం కారణంగా యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, యనైటెడ్ స్టేట్స్ లోకి పాకిస్ధాన్ విమానాలపై నిషేధం విధించారు. ముఖ్యంగా.. 2020 మేలో జరిగిన ప్రమాదంలో పాకిస్ధాన్ విమానం కరాచీ నగరంలో కూలిపోవడం వల్ల సుమారు 100 మంది మరణించారు. నవంబర్ 2023లో యూరోపియన్ యూనియన్ అవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ పాకిస్ధాన్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఫ్రాన్స్‌లోని పారిస్‌కు శుక్రవారం ఇస్లామాబాద్ నుంచి పాకిస్ధాన్ విమానం బయలుదేరింది.
నష్టాల్లో పాకిస్ధాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్!
పాకిస్ధాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థ 1955లో ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. 1990 దశకంలో వృద్ధి సాధించినా.. ప్రస్తుతం నిర్వహణ లోపాలు, నాణ్యత సమస్యలు ఎదురవుతున్నాయి. 2023లో $270 మిలియన్ల నష్టం చవి చూసింది. సంస్థపై $3 బిలియన్ల వరకు అప్పు ఉంది. ఇది సంస్థ మొత్తం ఆస్తుల విలువ కంటే 5 రెట్లు ఎక్కువ.