అక్షరటుడే, ఎల్లారెడ్డి: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల ప్రత్యేకాధికారి సురేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే పంచాయతీలకు నిధులను విడుదల చేసి కార్యదర్శులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో మార్చి ఒకటి నుంచి విధులు బహిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు అశ్వక్, రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.