అక్షరటుడే, బిచ్కుంద: తమ డిమాండ్ల సాధన కోసం 17న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు రూప్‌సింగ్, కార్యదర్శి సాయిలు, పట్టణ అధ్యక్షుడు భూమయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ పాల్గొన్నారు.