అక్షరటుడే, వెబ్ డెస్క్: టీజీ పీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 15,16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ సత్యనారాయణ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన వివిధ జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల గ్రూప్-3 పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని, గ్రూప్-2 ఎగ్జామ్స్ సైతం సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో రీజినల్ కో-ఆర్డినేటర్ సాయ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, తదితరులు పాల్గొన్నారు.