అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో తన విధులకు కాంగ్రెస్ కార్యకర్త ఆటంకం కల్పించాడని కానిస్టేబుల్ అరవింద్ ఒకటో టౌన్ లో ఫిర్యాదు చేశాడు. సమావేశానికి హసన్ అనే కార్యకర్త రాగా.. పాస్ లేకపోవడంతో తాను వేదిక పైకి అనుమతించలేదన్నారు. దీంతో సదరు వ్యక్తి తనతో గొడవకు దిగాడని పేర్కొన్నారు. తనపై దాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.