అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బీజేపీ నేతల మూసీ నిద్రతో ఒరిగేదేమి ఉండదని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర ప్రజల అటెన్షన్‌ డైవర్డ్‌ చేయడానికేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి నూకలు చెల్లాయని, అందుకే ఆపార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అభివృద్ధి, తాము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మహిళలకు, అన్నివర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్‌ విజయోత్సవ సభలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  HCU Lands | హెచ్​సీయూ భూముల అమ్మకంపై బీజేపీ పోరుబాట