అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని ఉన్నత పాఠశాలకు చెందిన భానుశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ బొజ్జ మల్లేశ్ గౌడ్ తెలిపారు. గత నెలలో సుద్దపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ఆమె ఆడనుంది. విద్యార్థినిని హెచ్ఎం లక్ష్మీ నర్సయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.