అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా పీడీఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గోపిమూర్తి గెలిచారు. మంగళవారం నుంచి సీపీఎస్‌ ఉద్యమంలో పాల్గొంటానని , ఉపాధ్యాయుల సమస్యలను మండలిలో వినిపిస్తానని గోపిమూర్తి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉపాధ్యాయులు ఓటేశారని పేర్కొన్నారు. తనను గెలిపించినవారికి కృతజ్ఞతలు తెలిపారు.